Balakrishna : బాలయ్య మంచి మనసు.. కష్టాల్లో అభిమానికి ఆర్ధికసాయం

నందమూరి బాలకృష్ణ మనసు వెన్న అని ఆయన్ని దగ్గర నుంచి చూసినవారు చెబుతారు. ఇప్పటికే ఆయన సేవా కార్యక్రమాలు చేపట్టారు. తన తల్లి పేరు మీద బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించి పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. తాజాగా తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలిసి చలించిపోయిన బాలయ్య భారీ ఆర్థిక సహాయం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రిస్వామి గత కొద్ది నెలలుగా లివర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపగా.. డబ్బులేకపోవడంతో దాతల సాయం కోసం చూస్తున్నాడు.
బద్రిస్వామి విషయాన్ని అభిమాన సంఘాలు బాలయ్య దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన అతనికి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల LOC మంజూరు చేయించారు. బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా ఈ LOC పత్రాన్ని బద్రిస్వామికి అందజేయగా.. బాలయ్య బాబుకు రుణపడి ఉంటానని అతడు కన్నీళ్లు పెట్టుకున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com