BALAYYA: వైఎస్ జగన్ ఓ సైకో: బాలకృష్ణ

BALAYYA: వైఎస్ జగన్ ఓ సైకో: బాలకృష్ణ
X
శాసనసభలో బాలయ్య తీవ్ర ఆగ్రహం.. కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలకు కౌంటర్

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ అసెం­బ్లీ సమా­వే­శాల సం­ద­ర్భం­గా.. తీ­వ్ర దు­మా­రం చె­ల­రే­గిం­ది. సి­ని­మా ఇం­డ­స్ట్రీ­కి సం­బం­ధిం­చిన వి­ష­యం­లో సభలో చర్చ­కు వచ్చిన అంశం.. రా­ష్ట్ర వ్యా­ప్తం­గా పెను సం­చ­ల­నం రే­పు­తోం­ది. అధి­కార తె­లు­గు­దే­శం, జన­సేన, బీ­జే­పీ కూ­ట­మి­లో­ని సభ్యుల మధ్య జరి­గిన చర్చ­లో­నే తీ­వ్ర వి­వా­దం చోటు చే­సు­కుం­ది. మాజీ మం­త్రి, బీ­జే­పీ ఎమ్మె­ల్యే కా­మి­నే­ని శ్రీ­ని­వా­స­రా­వు చే­సిన వ్యా­ఖ్య­ల­పై సినీ నటు­డు, హిం­దూ­పు­రం ఎమ్మె­ల్యే నం­ద­మూ­రి బా­ల­కృ­ష్ణ తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. కా­మి­నే­ని చే­సిన వ్యా­ఖ్య­లు అబ­ద్ధ­మ­ని కొ­ట్టి­పా­రే­శా­రు. గతం­లో వై­సీ­పీ హా­యం­లో అప్ప­టి ము­ఖ్య­మం­త్రి వై­ఎ­స్ జగ­న్‌ మో­హ­న్ రె­డ్డి­ని కలి­సేం­దు­కు.. సి­ని­మా ఇం­డ­స్ట్రీ పె­ద్ద­లు వె­ళ్లిన వి­ష­యం­లో.. చే­సిన వ్యా­ఖ్య­ల­ను బా­ల­కృ­ష్ణ ఖం­డిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా వై­ఎ­స్ జగ­న్‌­ను సైకో అంటూ బా­ల­కృ­ష్ణ సం­బో­ధిం­చ­డం తీ­వ్ర దు­మా­రా­ని­కి కా­ర­ణం అయిం­ది. చి­రం­జీ­వి గట్టి­గా అడి­గి­తే జగన్ దిగి వచ్చా­ర­న్న­ది అబ­ద్ధ­మ­ని చె­ప్పా­రు. ఎవరూ గట్టి­గా అడ­గ­లే­ద­ని తె­లి­పా­రు. అయి­తే తనను కూ­ట­మి ప్ర­భు­త్వం కూడా అవ­మా­నిం­చిం­ద­ని నం­ద­మూ­రి బా­ల­కృ­ష్ణ మం­డి­ప­డ్డా­రు. అదే సమ­యం­లో చి­రం­జీ­వి­పై­నా పరో­క్ష వి­మ­ర్శ­లు చే­శా­రు.

ఎఫ్డీ­సీ సమా­వే­శం­లో తన పేరు తొ­మ్మి­దివ స్థా­నం­లో పె­ట్టా­ర­ని, ఆ లి­స్ట్ తయా­రు చే­సిం­ది ఎవ­రం­టూ ప్ర­శ్నిం­చా­రు. తనకు కనీస గౌ­ర­వం కూడా ఇవ్వ­లే­ద­ని మం­డి­ప­డ్డా­రు. ఈ వి­ష­యా­న్ని మం­త్రి కం­దుల దు­ర్గే­శ్‌­కు ఫోన్ చేసి అడి­గా­న­ని బా­ల­కృ­ష్ణ తె­లి­పా­రు. సీ­ఎం­గా ఉన్న సమ­యం­లో వై­ఎ­స్ జగన్ సి­ని­మా ఇం­డ­స్ట్రీ­ని, సినీ పె­ద్ద­ల­ను పట్టిం­చు­కో­లే­ద­ని కా­మి­నే­ని శ్రీ­ని­వా­స­రా­వు ఆరో­పిం­చా­రు. అం­తే­కా­కుం­డా చి­రం­జీ­వి­ని.. గతం­లో జగన్ అవ­మా­నిం­చా­ర­ని పే­ర్కొ­న్నా­రు. సి­ని­మా ఇం­డ­స్ట్రీ నుం­చి చి­రం­జీ­వి, మహే­ష్ బాబు, ప్ర­భా­స్ సహా పలు­వు­రు అప్ప­టి ము­ఖ్య­మం­త్రి జగ­న్‌­ను కలి­సేం­దు­కు వె­ళ్ల­గా.. వా­రి­ని గేటు వద్దే ఆపే­శా­ర­ని.. సీఎం కా­కుం­డా సి­ని­మా­టో­గ్ర­ఫీ మం­త్రి వచ్చి కలు­స్తా­ర­ని చె­ప్పి­న­ట్లు మాజీ మం­త్రి కా­మి­నే­ని వె­ల్ల­డిం­చా­రు. అయి­తే ఆ సమ­యం­లో చి­రం­జీ­వి సీ­రి­య­స్ అయి.. గట్టి­గా మా­ట్లా­డ­టం­తో జగన్ వచ్చి మా­ట్లా­డి­న­ట్లు తె­లి­పా­రు. అదే సమ­యం­లో చి­రం­జీ­వి గట్టి­గా ని­ల­దీ­య­లే­ద­ని పే­ర్కొ­న­డం గమ­నా­ర్హం. అదే సమ­యం­లో గతే­డా­ది అధి­కా­రం­లో­కి వచ్చిన కూ­ట­మి ప్ర­భు­త్వం కూడా తనను అవ­మా­నిం­చిం­ద­ని బా­ల­కృ­ష్ణ తీ­వ్ర అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. ఫి­లి­మ్ డె­వ­ల­ప్‌­మెం­ట్ కా­ర్పొ­రే­ష­న్ (ఎఫ్డీ­సీ) సమా­వే­శం­లో తన పే­రు­ను 9వ స్థా­నం­లో పె­ట్టా­ర­ని.. బా­ల­కృ­ష్ణ ఫైర్ అయ్యా­రు.

Tags

Next Story