AP : బాలినేని వ్యూహం ఇదే..! ప్రకాశంలో సంచలనం

AP : బాలినేని వ్యూహం ఇదే..! ప్రకాశంలో సంచలనం
X

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్ఠానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నానన్నారు.

గురువారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలవబోతున్నాననీ.. ఆ పార్టీలో చేరబోతున్నానని పేర్కొన్నారు బాలినేని. ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా ఆయన వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి అనంతరం బాలినేని ఒంగోలును వీడి హైదరాబాద్ కు మకాం మార్చారు.

పార్టీ అధినేత జగన్ ను బాలినేని ఆ తర్వాత కలవలేదు. పార్టీ సమావేశాలకూ దూరంగా ఉంటూ వచ్చారు. బుజ్జగింపులు కూడా ఫలించలేదు.

Tags

Next Story