Bandla Ganesh : విజయసాయిరెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం : వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ బండ్ల గణేష్

Bandla Ganesh : విజయసాయిరెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం : వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డ బండ్ల గణేష్
X
Bandla Ganesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు సినీ నిర్మాత బండ్ల గణేష్.

Bandla Ganesh : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్వీట్లతో విరుచుకుపడ్డారు సినీ నిర్మాత బండ్ల గణేష్. విజయసాయిరెడ్డి రాష్ట్రానికి పట్టిన దరిద్రం అంటూ కామెంట్ చేశారు. విశాఖలో దోచుకుని, హైదరాబాద్‌కు తరలిస్తున్నావంటూ పెద్ద ఆరోపణలే చేశారు.

విజయసాయిరెడ్డి బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసని, ఎంపీగా ఉన్నందున కళ్లు నెత్తికెక్కాయంటూ మండిపడ్డారు. నచ్చని వ్యక్తులను పేరు పెట్టి తిట్టాలే గాని కులాన్ని కాదు అంటూ ట్వీట్లు చేశారు. కమ్మ వాళ్లు నచ్చకపోతే నేరుగా తిట్టాలని, చంద్రబాబును టీడీపీని అడ్డంపెట్టుకుని తిట్టండని, అంతేగాని కమ్మ అనే సామాజిక వర్గ పేరుతో దూషించడం ఏంటని మండిపడ్డారు.

కులాల విషయంలో ఎలా వ్యవహరించాలో సీఎం కేసీఆర్‌ను చూసి నేర్చుకో అంటూ చురకలు అంటించారు. ఈ ట్వీట్ల తరువాత తనను విజయసాయిరెడ్డి ఇబ్బంది పెడతారని తెలిసినా.. తెగించి మరీ కామెంట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Tags

Next Story