రాష్ట్ర సర్కార్ కన్ను శ్రీవారి ఖజానాపై పడింది :బీజేపీ అధికార ప్రతినిధి

రాష్ట్ర సర్కార్ కన్ను శ్రీవారి ఖజానాపై పడింది :బీజేపీ అధికార ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం కన్ను శ్రీవారి ఖజానాపై పడిందని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద బాండ్ల రూపంలో శ్రీవారి సొమ్మును డిపాజిట్‌ చేసే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తోందని.. బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ రెడ్డి ఆరోపించారు. ఈ విధానాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. శ్రీవారి ఆదాయాన్ని అధిక వడ్డీ పేరుతో బాండ్లుగా మారిస్తే అత్యవసర సమయాల్లో ఎలా విత్‌డ్రా చేస్తారని ప్రశ్నించారు. పాలక మండలి నిర్ణయాలు భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని మండిపడ్డారు. తిరుమల భక్తుల కానుకలతో నడిచే పుణ్యక్షేత్రమే కానీ... ధనార్జన క్షేత్రం కాదన్నది టీటీడీ గుర్తించాలని భానుప్రకాశ్‌ రెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story