Vijayawada : శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ...

Vijayawada : శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న బెజవాడ దుర్గమ్మ...
X

బెజవాడకు పోటెత్తిన భక్తులు.. శాకంబరీ దేవిగా దుర్గమ్మ దర్శనం..

ఇంద్రకీలాద్రి పై వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఇరు తెలుగు రాష్ట్రాల నుండి లక్షల మంది మంది భక్తులు పాల్గొని అమ్మ వారికి తమ మొక్కలు చెల్లించుకోనున్నారు

ఇంద్రకీలాద్రిపై నెలకొన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. మూలవిరాట్ దుర్గమ్మ ను శాకంబరీదేవి రూపంలో పండ్లు, ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీను నాయక్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కూడా కూరగాయల తో అందంగా తీర్చిదిద్దారు. దీంతో ఇంద్రకీలాద్రి ఆకు పచ్చ వర్ణంలో మెరిసిపోతోంది.

మొదటి రోజు ఉత్సవాల లో భాగంగా అమ్మ వారి ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించినట్లు అధికారులు తెలిపారు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల దాతల నుంచి కూరగాయలు సేకరించమన్నార. ఆషాడ సారె సమర్పణ బృందాలు అదే విదంగా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.

ఈ నెల 10 న శాకంబరీ ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ మూడు రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రత్యేక, అంతరాలయ దర్శనాలను రద్దు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story