Bhaahubali Theater : బాహుబలి థియేటర్ మూసివేత..!

Bhaahubali Theater : సినిమా టికెట్లపై ప్రభుత్వ వైఖరి, థియేటర్లలో అధికారుల తనిఖీలను నిరసిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల స్వచ్చంధంగా సినిమా థియేటర్లను మూసివేస్తున్నారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న వి-ఎపిక్ మల్టీప్లెక్స్ థియేటర్నుయాజమాన్యం మూసివేసింది.
రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలు తగ్గించడంతో థియేటర్‌ను స్వచ్చంధంగా మూసివేస్తునట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసియాఖండంలోనే అతి పెద్ద స్కీన్ ఏర్పాటు చేసిన ఈ థియేటర్‌లో 640 సీట్ల కెపాసిటీ ఉంది. ప్రేక్షకులకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని నిర్మించారు.
రాష్ట్ర ప్రభుత్వం తమపై దృష్టి పెట్టి... సినిమా థియేటర్ల యజమానులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని మాల్స్ యజమానులు కోరుతున్నారు. థియేటర్ మూసివేయడంతో సినిమా చూద్దామని వచ్చిన ప్రేక్షకులు నిరాశగా వెనుతిరిగి వెళ్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com