Bharat Jodo Yatra: 42వ రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర ..

Bharat Jodo Yatra: 42వ రోజుకు చేరుకున్న రాహుల్ పాదయాత్ర ..
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఏపీలో 3వ రోజు జోరుగా సాగుతోంది. అందరినీ కలిపి ఐక్యం చేయాలనే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టామని అంటూ ముందుకు సాగుతున్నారు.

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఏపీలో 3వ రోజు జోరుగా సాగుతోంది. అందరినీ కలిపి ఐక్యం చేయాలనే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టామని అంటూ ముందుకు సాగుతున్నారు.


మరోవైపు ఏపీ అభివృద్ధికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని, తమ ప్రభుత్వం వస్తే.. ప్రత్యేక హోదా, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అని మూడు రాజధానులు ఆలోచనే అర్థరహితం అంటూ క్లారిటీ ఇచ్చేశారు.. తెలుగు నేలపై అడుగుపెట్టిన రాహుల్‌ తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఇవాల్టీ భారత్‌ జోడో యాత్ర షెడ్యూల్‌ చూస్తే 42వ రోజుకు చేరుకున్న పాదయాత్ర బనవాసి ప్రారంభమై ముగతి వరకు సాగనుంది అక్కడ మార్నింగ్‌ బ్రేక్‌ ఇచ్చారు.. బ్రేక్‌ ఫాస్ట్‌ తరువాత ఏపీకి చెందిన కీలక నేతలతో సమావేశం అవుతారు... రాజస్థాన్‌ నేత సచిన్‌ పైలెట్‌ కూడా రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. లంచ్‌ బ్రేక్‌ తరుదాత ముగతి గ్రామంలోని రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు. రాయలసీమ సమస్యలపై తనకు అవగాహన ఉందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హమీ ఇస్తున్నారు.

ఇక తిరిగి సాయంత్రం నాలుగు గంటకు పాదయాత్ర ప్రారంభమై.. కల్లుదేవకుంట వరకు సాగనుంది..రాత్రి 6.30 గంటలకు కల్లుదేవకుంట గ్రామంలో కార్యకర్తల ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు రాహుల్‌. రాత్రి మంత్రాలయం మండలం చెట్నిహళ్లిలో బస చేయనున్నారు. 42వ రోజు పాదయాత్ర ముగిసిన తరువాత మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోనున్నారు.

భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్‌ను కలిసేందుకు సెక్యూరిటీ వలయం దాటుకొని మరీ దూసుకు వస్తున్నారు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో పంట పొలాల్లో దిగి రైతులతో మాట్లాడుతున్నారు. దారి పక్కన వేచి చూస్తున్న ప్రజల దగ్గరికి వెళ్లి పలకరిస్తున్నారు రాహుల్‌.

Tags

Read MoreRead Less
Next Story