Kakinada Police : కాకినాడలో బైక్ రైడర్స్ ఓవరాక్షన్.. లోపలేసిన ఎస్పీ

Kakinada Police : కాకినాడలో బైక్ రైడర్స్ ఓవరాక్షన్.. లోపలేసిన ఎస్పీ
X

ఇయర్ ఎండ్ రివ్యూల్లో పోలీస్ శాఖ బిజీగా ఉంది. బ్యాడ్ రికార్డ్స్ చూసుకునేందుకు థర్టీ ఫస్ట్ నైట్ కూడా గట్టి బందోబస్త్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఆకతాయిలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో కాకినాడ వన్, టూ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బైక్‌లపై విన్యాసాలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌, సైలెన్సర్లు తీసి భారీ శబ్ధంతో న్యూసెన్స్‌ చేస్తున్న ఆకతాయిలను పట్టుకున్నారు. వారందరినీ ట్రాఫిక్ పార్క్ కు తరలించారు. భారీ జరిమానాలు విధించారు. మరోసారి ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుపడ్డవారికి కౌన్సిలింగ్‌ చేసి వదిలిపెట్టారు.

Tags

Next Story