Andhra Pradesh : ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

ఏపీలోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఈ రెండు జిల్లాల్లోని పలు కోళ్ల ఫారాల్లో వందల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లా వాసుల్లో భయం మొదలైంది. కిలో చికెన్ 30 రూపాయలకే అమ్ముతున్నా కొనేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితులు నెల కొన్నాయి. పెరవలి మండలం కానూరు గ్రామంలో చాలా కోళ్లు చనిపోయాయి. ఈ గ్రామంలోని పౌల్ట్రీల్లో చనిపోయిన కోళ్ల శాంపిళ్లను సేకరించి పుణె ల్యాబ్క పంపించారు. పరీక్షల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీ అధి కారులు తూర్పుగోదావరి జిల్లాలో రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. కోళ్లు ఎక్కడ చనిపోతున్నా పశుసంవర్ధక శాఖ అధికా రులకు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. తణుకు, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు చనిపోయాయి. ఒక్కో కోళ్ల రంలో రోజుకు 10 వేలకు పైగా కోళ్లు చనిపోతున్నాయి. బర్ల్ ఫ్లూ భయంతో చికెన్ సెంటర్లకు ఉమ్మడి గోదావరి జిల్లా వాసులు ఆమడ దూరంలో ఉంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com