తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల..!

తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల చేశాయి. ఈ మేరకు తిరుపతిలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ అభ్యర్థి రత్నప్రభతో పాటు పలువులు ముఖ్యనేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.
తిరుపతి ఉపఎన్నికలో బీజేపీ-జనసేన మేనిఫెస్టో విడుదల
తిరుపతిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు బీజేపీ-జనసేన హామీ
తిరుపతిలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
బీజేపీని గెలిపిస్తే హిందూ సంస్కతి, కళలు పరిరక్షిస్తామని హామీ
దేవాలయాల్ని ప్రభుత్వ నియంత్రణ నుంచి తొలగిస్తామని వెల్లడి
నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు పెద్ద పీట వేస్తామని మేనిఫెస్టోలో హామీ
మోడల్ స్కూల్, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు హామీ
పదో తరగతి చదివే దళిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్ ఇస్తామని హామీ
స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడి
కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ
ప్రతీ కుటుంబానికి ఉచిత గృహ వసతి కల్పిస్తామని వెల్లడి
రైతులు, మత్య్యకారులు, చేనేత, స్వయం ఉపాధికి రుణాలు ఇస్తామని హామీ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com