తిరుపతి ఉపఎన్నికపై హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక మీటింగ్

తిరుపతి ఉపఎన్నికలపై హైదరాబాద్‌లో ఏపీ బీజేపీ కీలక భేటీ నిర్వహించింది. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధరన్‌తో సోము వీర్రాజు, ముఖ్యనేతలు భేటీ అయ్యారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోబీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ఇతర నేతలు సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
జనసేన నుంచి అభ్యర్థి ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. దీంతో పవన్‌తో భేటీ అంశాలపై బీజేపీ ముఖ్యనేతలు చర్చిస్తున్నారు. బైపోల్స్ అభ్యర్థిపై ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతిలోక్ సభ స్థానం ఉప ఎన్నికపై నిన్న జనసేన-బీజేపి నేతల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. నిన్న రాత్రి మూడు గంటలపాటు చర్చలు జరిపారు. అయితే.. అభ్యర్ధి ఎంపికపై మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధిని ఎంపిక చేయాలని నిశ్చయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com