తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది : విష్ణువర్ధన్‌రెడ్డి
తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వేలాది మంది దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయిస్తోందని ఆరోపించారు. అడ్డుకోవాల్సిన పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది వైసీపీకి తొత్తులుగా వ్యహరిస్తున్నారని విమర్శించారు. తిరుపతిలో వైసీపీ అరాచక శక్తులను ఈసీ అడ్డుకోవాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
తక్షణం కేంద్ర ఎన్నికల సంఘం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను రద్దు చేయాలి.
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 17, 2021
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అధికార @YSRCParty అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలీసులు,అధికారులు, ఏన్నికల సిబ్బంది సహకారంతో విపక్ష పార్టీల ఏజెంట్లను సైతం గెంటివేసి దొంగ ఓట్లు వేయించుకోవడం సిగ్గుచేటు@ECISVEEP
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com