వైసీపీ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం : బీజేపీ

వైసీపీ సర్కార్‌తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం : బీజేపీ

వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి తాము సిద్ధమవుతున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో రేపు ఛలో అంతర్వేది కార్యక్రమం చేపడతామన్నారు. దుర్గగుడిలో సింహాలు మాయమయ్యింది వైసీపీ ప్రభుత్వంలో అయితే.. గత ప్రభుత్వానికి సంభందమేంటని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ఉద్యమానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story