హాట్సాఫ్ సోనూసూద్ : మరో ప్రాణాన్ని నిలబెట్టిన రియల్ హీరో!

సోనూసూద్.. లాక్ డౌన్ సమయంలో చాలామంది వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. అంతటితో ఆగకుండా తన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు. చిన్న పిల్లలకు వైద్యం, పేద విద్యార్థులకు చదువులు.. ఉద్యోగాలు ఇలా ఏ కష్టం ఉన్నా సరే .. ముందుకు వచ్చి తానున్నానని భరోసా కల్పిస్తున్నాడు. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు సోనూసూద్.
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామనికి చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవి దంపతుల 8 నెలల కుమారుడు ఉన్నాడు.. అయితే ఆ బాబుకి గుండె సమస్య ఉంది. అయితే ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఆపరేషన్ చేయించలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో కొఠారి శ్రీనివాస్ అనే వ్యక్తి వారి వివరాలను సోనూసూద్ కు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
అయితే దీనిపైన వెంటనే స్పందించిన సోనూసూద్ ఆ చిన్నారికి జనవరి 9న ఆపరేషన్ చేయించారు.ఈ ఆపరేషన్ కి సంబంధించిన రూ.6 లక్షలు బిల్లును సోనుసూద్ చెల్లించారు. బాబుకి పునర్జన్మనిచ్చిన సోనూ సూద్ కు ఆ బాబు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
आप हमारे भगवान हो ..अब और क्या कहूँ। आपने मेरे बच्चे की जान बचा ली। धन्यवाद @SonuSood @GovindAgarwal_ https://t.co/e4d1rzJbFP pic.twitter.com/y0HBahwVLb
— SHANMUKH / Shammy-kotari (@Sriharshakotari) January 22, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com