BOMB THREAT: చంద్రబాబు, జగన్ ఇళ్లకు బాంబు బెదిరింపులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు హెచ్చరికలు తీవ్ర అలజడి రేపాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇళ్లతో పాటు తిరుపతిలోని పలు ప్రాంతాల్లో కూడా బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి. ‘హోలి ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్’ పేరుతో భారీ పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు ఆ మెసేజ్ లో తెలిపారు. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు.. ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన ప్రతి దాన్ని అడుగడుగునా చెక్ చేశారు. ఈ నెల 6వ తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో బాంబ్ స్వ్కాడ్ సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు అలర్టు అయ్యారు. తాజాగా, బాంబు బెదిరింపులతో తిరుపతి, శ్రీకాశహస్తిలోనూ క్షుణ్ణంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. తిరుపతి అగ్రికల్చర్ కాలేజీలోని ముఖ్యమంత్రి హెలిపాడ్ దగ్గర కూడా నిశీతంగా పరిశీలన చేస్తున్నారు. తిరుపతి పట్టణంలో హై టెన్షన్. టౌన్ లోని నాలుగు చోట్ల RDX బాంబులు పెట్టాం అంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి పోలీసులకు ఈ మెయిల్స్ వచ్చాయి. తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థం ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం, న్యాయమూర్తుల నివాస సముదాయం, కోర్టు ప్రాంగణం ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. 6వ తేదీ సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదుల పేరుతో బెదిరింపులు రావటంతో పోలీసులు విస్త్రృతంగా తనిఖీలు చేపట్టారు.
తమిళనాడులోనూ...
తమిళనాడులోనూ బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. స్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లతో పాటు పలు ప్రదేశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీ నటి త్రిష నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయానికి, డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ బృందాలు, డాగ్ స్క్వాడ్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com