Botsa Satyanarayana : 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదే : మంత్రి బొత్స

Botsa Satyanarayana : విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదేనని కామెంట్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు ఉమ్మడి రాజధానిగా 2024 వరకు హైదరాబాదే రాజధానిగా ఉంటుందని చెప్పుకొచ్చారు. వైసీపీ విధానం ప్రకారం అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమేనని స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ కమిటీ చేసిన ప్రధాన సూచన ప్రకారమే తాము వికేంద్రీకరణ చేపట్టామని అన్నారు. రాజధాని విషయంలో కోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చించాలా వద్దా అనేది బీఏసీలో నిర్ణయిస్తామని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స. శాసనసభలు, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికని.. చట్టాలు చేసే అధికారం చట్టసభలకు లేదని కోర్టు చెప్పలేదని అన్నారు. కోర్టు కేవలం సీఆర్డీఏ చట్టంలో మార్పులు చేసే అంశంపైనే వ్యాఖ్యానించిందని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com