Botsa Satyanarayana : హైదరాబాద్‌లో అసలు కరెంటే ఉండడం లేదు : మంత్రి బొత్స

Botsa Satyanarayana : అటు ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన… బాధ్యత కలిగిన మంత్రి అలా మాట్లాడొద్దన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని అన్నారు.
కేటీఆర్‌కు ఎవరో చెప్పారు గానీ.. తాను స్వయంగా హైదరాబాద్ లో ఉండివచ్చానని.. అక్కడ కరెంట్ లేకపోవడంతో జనరేటర్ వేసుకున్నానని చెప్పారు. కరెంట్ లేక తాను హైదరాబాద్‌లో చాలా ఇబ్బంది పడ్డానని మంత్రి బొత్స ఎదురుదాడి చేశారు.
అటు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు.. ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ ఏపీ గురించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండరని భావిస్తున్నానని.. ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీలోని పరిస్థితులను గమనించడానికి 4 బస్సులు కాదు.. 400 బస్సుల్లో రావాలని సవాల్ విసిరారు. జగన్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూడడానికి రాష్ట్రమంతటా పర్యటించాలని కోరారు. ఏదో సభలో ఉన్న వారిని నవ్వించడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com