Brother Anil Kumar: ఏపీ రాజకీయాల్లోకి బ్రదర అనిల్? ఇందులో నిజమెంత?

Brother Anil Kumar (tv5news.in)

Brother Anil Kumar (tv5news.in)

Brother Anil Kumar: ఏపీ రాజకీయాల్లోకి బ్రదర్‌ అనిల్ ఎంటరయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

Brother Anil Kumar: ఏపీ రాజకీయాల్లోకి బ్రదర్‌ అనిల్ ఎంటరయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. విజయవాడలోని ఓ హోటల్‌లో పలు సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీసీ, మైనార్టీ, క్రిస్టియన్‌ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పలు సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. సమస్యలు పరిష్కరిస్తారనే జగన్‌కు ఓటేశామని.. ఇప్పుడు సీఎంతో మాట్లాడేందుకు అనుమతి కూడా దొరకడం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాపోయారు. సమస్యలపై చర్చించేందుకు బ్రదర్‌ అనిల్‌ను కలిశామన్న బీసీ సంక్షేమ సంఘం నేత నాగరాజు.. ఆయన చెబితేనే ఎన్నికల్లో ఓట్లు వేశామన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కావాలని కోరామని.. తమ సమస్యలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని బ్రదర్ అనిల్‌ చెప్పినట్లు బీసీ సంక్షేమ సంఘం నేత పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story