Visakhapatnam Bride Death: 'సృజనకు ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవు..' సోదరుడి వాంగ్మూలం

Visakhapatnam Bride Death: విశాఖ మధురవాడలో పెళ్లిపీటలపైనే కుప్పకూలిన వధువు మృతి చెందడానికి కారణాలు ఏంటనే దానిపై విచారణ జరుగుతోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే కానీ తను ఏ విషం తీసుకుంది, నిజంగా ఆత్మహత్యాయత్నం చేసిందా అనేదానిపై క్లారిటీ వచ్చేట్టు కనిపించడం లేదు. బంధువులైతే మాత్రం సృజనది ఆత్మహత్య అంతే నమ్మలేకపోతున్నాం అంటున్నారు. ఆమెకు ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవని చెప్తున్నారు.
ఐతే.. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఫంక్షన్ కారణంగా డేట్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడిందని సృజన సోదరుడు విజయ్ చెప్తున్నారు. పెళ్లి రోజు రెండోసారి అస్వస్థతకు గురవడంతో తాము ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించామని, ఇంతలోనే తను మృతి చెందిందని అంటున్నారు. ఇరువర్గాలు బంధువులమేనని, వరుడు తెలుగుదేశం వ్యక్తి అవడంతో దీన్ని కొందరు రాద్ధాంతం చేయాలని చేస్తున్నారని అంటున్నాడు.
సృజన విషయంలో ఆమె తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడితే తప్ప ఏం జరిగిందో బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అటు, ఆమె సెల్‌ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులకు ఏమైనా కీలక సమాచారం తిరిగితే కేసు మలుపు తిరుగుతుంది. సృజన బ్యాగ్‌లో గన్నేరు పన్ను పొట్టు ఎందుకు ఉంది, అసలు ఏం జరిగింది అనేదైతే ఇప్పటికే మిస్టరీగానే ఉంది. మరికాసేపట్లో డెడ్‌బాడీని ఆమె బంధువులకు అప్పగించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com