BRS in AP : ఫిట్ట్ కాని సిట్టింగులే ఏపీ లో కేసీఆర్ టార్గెట్...!

Hyderabad
BRS in AP : ఫిట్ట్ కాని సిట్టింగులే ఏపీ లో కేసీఆర్ టార్గెట్...!
జాతీయ స్థాయి గుర్తింపు కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న కేసీఆర్; ఏపీలో సర్వే... నివేదికను బట్టే కార్యాచరణ...


ఏపీలో సర్వే చేయించిన కేసీఆర్.

టిక్కెట్టురాని నేతలు సంప్రదిస్తున్నారంటోన్న బీఆరెస్.

సంక్రాంతి తర్వాత ఏపీలో పార్టీ సమావేశం

అధిక సంఖ్యలో నాయకులు హాజరవుతారని అంచనా

నాందేడ్ లో భారీ సభకు ఏర్పాట్లు చేస్తున్న గులాబీ పార్టీ

ఇప్పటికే పలువురు నాయకులకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్.



Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో పార్టీ స్ధాపన, విస్తరణపై కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు. తోటి తెలుగు రాష్ట్రంలో పార్టీలో చేరికలు, రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రగతి భవన్లో సుదీర్ఘ సమీక్షలే చేస్తున్నారట. పార్టీ పట్ల ఆంధ్ర ప్రదేశ్ లో వున్న స్పందనను తెలుసుకునేందుకు సర్వేలు కూడా నిర్వహించినట్టు సమాచారం. తెలంగాణలో రైతాంగానికి అందుతున్న పథకాలు ఎలా వున్నాయి?, మూడు పార్టీల్లో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఎవరికుంది? హైదరాబాద్లో సీమాంధ్రులు సజావుగా జీవించగలుగుతున్నారా? కేసీఆర్ నాయకత్వం పై మీ అభిప్రాయమేంటి? వంటి ప్రశ్నల ద్వారా ఆయా ప్రాంతాల్లో బీఆరెస్ పట్ల స్పందనను తెలుసుకుంటున్నారట. ఇదే తరహా సర్యేలు కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనూ చేశారట.


సరిహద్దు జిల్లాలు, అసంతృప్తి నేతలపై గురి....


తెలంగాణ సరిహద్దు జిల్లాలైన కర్నూలు, ప్రకాశం, కృష్ణ, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీఆరెస్ పట్ల ప్రజలు సుముఖంగానే ఉన్నారని బీఆరెస్ వర్గాలు చబుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలనాటికి సుమారు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు అనుకూల వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మూడు నుంచి నాలుగు స్ధానాల్లో పోటి చేసే ప్రణాలికలున్నాయని తెలుస్తోంది. విద్యావంతులు, ఆర్ధికంగా బలంగా ఉన్నవారు, సైద్దాంతిక పరంగా బీఆరెస్ బావజాలంపై మాట్లాడగల అభ్యర్దులను పార్లమెంటుకు పరిశీలిస్తోన్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత ఏపీలో పార్టీ ప్రారంభ సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుతున్నాయట.



ఈలోగా మరికొంతమంది నాయకులను చేర్చుకోవడం ద్వారా ప్రారంభ సమావేశంతోనే ప్రాధాన్యత దక్కించుకోవాలని ఆశిస్తోందట. చాలామంది సిట్టింగులు కూడా తమ వైపు చూస్తున్నారని కేసీఆర్ నేరుగానే సంకేతాలిచ్చారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ, వైసీపీలు మాత్రమే ప్రధాన పార్టీలుగా వుండగా.. పవన్ కళ్యాణ్ జనసేన కూడా టీడీపీతో పొత్తుకెళ్లే అవకాశం అధికంగా కనిపిస్తుండటంతో ఇరు పార్టీల్లో టిక్కెట్టు దక్కే అవకాశంలేనివారు బీఆరెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం కొందరు కేసీఆర్ తో టచ్ లో వున్నారని గులాబీపార్టీ నేతలంటున్నారు.


కర్నాటక, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ ల్లోనూ అదే వ్యూహం


ఇదే తరహా విస్తరణ మహారాష్ట్ర, కర్నాటక, రాష్ట్రాల్లో కూడా పార్టీ భారీ సమావేశాల ద్వారా విస్తరణ కార్యాచరన రూపొందిస్తోందట. ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్న పథకాలను సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేసేందుకు పలువురిగి బాధ్యతలు కూడా కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అతి త్వరలో మహారాష్ట్రలోని నాంధేడ్ లో బీఆరెస్ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.



తెలంగాణ సరిహద్దు జిల్లాలైనా నాందేడ్ లో సిక్కు సమాజిక వర్గం కూడా గణనీయంగానే వున్న నేపథ్యంలో ఇప్పటికే వారితో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింఘ్ సమావేశవుతున్నారట. నాందేడ్ లోని ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణంలో ఆ సమావేశం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు, తేదీ మాత్రమే కేసీఆర్ ఫైనలైజ్ చేయాల్సివుందని తెలుస్తోంది.



మంత్రి శ్రీనివాస్ గౌడ్ కర్నాటకలోని హైదరబాద్ కర్నాటక ప్రాంతాల్లో గౌడ, ఈడిగ, యాదవ సామాజిక వర్గ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికూడా మహారాష్ట్రలో పర్యటించారు. సుమారు 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలుపుకోమని కోరుతున్నారంటే కేసీఆర్ పాలన పట్ల వారి విశ్వాసం అర్ధమౌతోందని చెప్పుకుంటున్నారు. ఈ వ్యూహాత్మక అడుగుల ద్వారా ఎన్నికల కమిషన్ లో జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు మూడు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లను పొందడం కూడా సాధ్యమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట.

Tags

Read MoreRead Less
Next Story