Budameru : బుడమేరు యుద్ధం.. మూడో గండి పూడ్చివేత

Budameru : బుడమేరు యుద్ధం.. మూడో గండి పూడ్చివేత

విజయవాడ శివారులో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేత పనులు పూర్తవగా మూడో గండి పూడ్చేందుకు పనులు వేగంగా సాగుతున్నాయి. మూడో గండిని పూడ్చేందుకు 40 మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం రంగంలోకి దిగింది.

ఇప్పటి వరకు పదమూడు వందల ట్రిప్పుల బండరాళ్లు, మట్టి కంకర తరలించారు. రోడ్డు ఏర్పాటుకు, రెండు గండ్ల ఏర్పాటుకు దాదాపు 50వేల టన్నుల మెటీరియల్‌ను వినియోగించారు. గండ్ల పూడ్చివేతను మంత్రి నిమ్మల రామానాయుడు రాత్రి పగలు తేడా లేకుండా దగ్గరుండా పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ శుక్రవారం సాయంత్రం వరకు మూడో గండిని కూడా పూడ్చేందుకు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

Tags

Next Story