AP : జగన్ పై బుద్ధా వెంకన్న ఫైర్

AP : జగన్ పై బుద్ధా వెంకన్న ఫైర్
X

'వరదల్లో ప్రజలు అల్లాడుతుంటే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తివి. ఏనాడైనా బురదలో అడుగు పెట్టి ప్రజలను కలిశావా. నువ్వా పేద ప్రజల కోసం మాట్లాడేది. వరద బాధితు లకు నువ్వెంత సహాయం చేశావు. కోటి రూపాయలు ప్రకటించి ఎవరికీ ఖర్చు పెట్టారు. సిగ్గు, శరం లేకుండా అసత్యాలు, అబద్ధాలు ప్రచారం చేస్తావా' అంటూ మాజీ సీఎం జగన్పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శమన్నారు. ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించారని కొనియాడారు. చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని ప్రజలు గొప్పగా చెబుతుంటే వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని మండిపడ్డారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారనడానికి సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలు ప్రచారం చేసే అడ్రెస్ లేకుండా పోయారని విమర్శించారు. మళ్లీ ఇలానే ఉంటే వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Tags

Next Story