Anakapalli : అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్స్ కంపెనీ.. 7,500 మందికి ఉద్యోగాలు

ఏపీలోని అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాం బిల్లి ఫేజ్-2లో లారెస్ ల్యాబ్స్ సంస్థ బల్క్ డ్రగ్స్ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. లారెస్ ల్యాబ్స్ దాదాపు రూ.5,000 కోట్లు ఇక్కడ పెట్టుబడిగా పెట్ట నుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ల్యారెస్ ల్యాబ్స్ ఇప్పటికే విశాఖ పరిసర ప్రాంతాల్లో 2007 నుంచి పెట్టుబడులు పెడుతూ వస్తోంది. ఇప్పటివరకు రూ.6,500 కోట్లతో తయారీ యూనిట్లు నెలకొల్పగా, 10 వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. లారెస్ ల్యాబ్స్ సంస్థకు బెంగళూర్, హైదరాబాద్ లో కూడా యూనిట్లు ఉన్నాయి. సంస్థ విస్తరణలో భాగంగా రాంబిల్లిలో పరిశ్రమలు పెడుతోంది. ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి చేయనుంది.
ఏపీలో సంస్థ విస్తరణపై కొద్దిరోజులుగా రాష్ట్ర ప్రభుత్వంతో లారస్ ల్యాబ్స్ సంప్రదింపులు జరుపుతోంది. లారస్ ల్యాబ్స్ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావా నరసింహారావు గురువారంనాడు సచివాలయంలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. భూకేటాయింపులు చేసినందుకు సీఎంకు సంస్థ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిం చే విషయంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని చెప్పిన ముఖ్య మంత్రి... భూ కేటాయింపులతో పాటు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని... సాధ్యమైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని కోరారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పెద్దఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com