Flight : బంపర్ ఆఫర్.. రాజమండ్రి టు తిరుపతి ఫ్లైట్ టికెట్ రూ.1,499లకే..

Flight : బంపర్ ఆఫర్.. రాజమండ్రి టు తిరుపతి ఫ్లైట్ టికెట్ రూ.1,499లకే..
X

పవిత్ర పుణ్యక్షేత్రాలైన రాజమండ్రి – తిరుపతి మధ్య ఎలియన్స్ ఎయిర్ లైన్స్ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా ఎలియన్స్ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

మూడు రోజుల పాటు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499 లకే అందుబాటులోకి తెచ్చింది. వాస్తవానికి మొదట ఈ ప్రారంభ ధరను రూ.1,999 లుగా నిర్ణయించినా.. తాజాగా దాన్ని మరింత తగ్గించి రూ.1,499 లకు మార్చారు.

ఆఫర్ ఈ తేదీల్లో మాత్రమే.. ఈ ప్రత్యేక ఆఫర్ అక్టోబరు 2, 4, 6 తేదీలలో మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎలియన్స్‌ విమాన సంస్థ తెలిపింది. కొత్త సర్వీసు ప్రారంభోత్సవం అక్టోబర్ 1న జరగనుంది. ఉదయం 9:25 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన విమానం రాజమహేంద్రవరం చేరుకుంటుంది.

అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ విమాన సర్వీసులు వారంలో మూడు రోజులు అంటే మంగళవారం, గురువారం, శనివారం నాడు అందుబాటులో ఉంటాయి.

ఈ బంపర్ ఆఫర్‌ను వినియోగించుకోవాలని, సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎలియన్స్ ఎయిర్ లైన్స్ కోరింది.

Tags

Next Story