Home Minister Anitha : గంజాయి సాగు 100 ఎకరాలకు తగ్గింది: హోంమంత్రి అనిత

రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరా కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా పెడుతున్నాం. గంజాయి విక్రయిస్తున్న వారిని గుర్తిస్తున్నాం. విక్రయించే వారి ఆస్తులు సీజ్ చేస్తాం. రాష్ట్రంలో గంజాయి సాగు 11వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు తగ్గింది. కింగ్ పిన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం’ అని వివరించారు. ‘గంజాయి అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ గంజాయి అరికట్టడంపై దృష్టి పెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో గంజాయి రూపం మార్చుకుంది. డ్రై లిక్విడ్ రూపంలో గంజాయి వస్తోంది. స్కూల్స్, కాలేజీ పిల్లలు గంజాయికి బానిసలు కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. గంజాయి సాగు 11 వేల ఎకరాల నుంచి 100 ఎకరాలకు వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అరికడతాం. మహిళలకు గంజాయి అలవాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com