ఎస్సై దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపంగా ఏలూరులో కొవ్వొత్తుల ర్యాలీ

ఎస్సై దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపంగా ఏలూరులో కొవ్వొత్తుల ర్యాలీ

కృష్ణా జిల్లా చిల్లకల్లులో SIగా విధులు నిర్వహిస్తూ కొవిడ్‌తో చనిపోయిన అల్లు దుర్గాప్రసాద్‌ మృతికి సంతాపంగా ఏలూరులో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. దుర్గారావు చిత్రపటానికి యాదవ సంఘం ప్రతినిధులు నివాళులు అర్పించారు. దుర్గారావు మృతికి ఎన్నోకారణాలున్నాయని వారు అన్నారు. పోలీసుశాఖలో కొందరి వేధింపులే కారణమని వారి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారని... చెప్పారు. SI దుర్గారావు మృతిపై విచారణ చేసి ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. వారు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో పదేళ్లపాటు పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌గా దుర్గారావు నిజాయితీకి అప్పుడే సరైన గుర్తింపని సంఘం ప్రతినిధులు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story