లేడీ డాక్టర్ నిర్వాకం.. మద్యం తాగి కారు నడిపి..

హతవిధీ.. మంచీ చెడు తెలిసిన డాక్టరే మద్యం తాగి కారు డ్రైవ్ చేస్తుంటే మామూలు మనుషుల సంగతేంటి.. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, అవసరమైతే నాలుగు మాటలు గట్టిగా చెప్పి అయినా రోగి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోమని చెప్పే డాక్టర్ కు ఏమైంది.. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించవలసిన డాక్టర్లు ఇలా బాధ్యత మరిచి ప్రవర్తిస్తే ఏమనుకోవాలి. డాక్టర్ వృత్తికే కళంకం తెచ్చే పని ఆ లేడీ డాక్టర్ చేసింది. అదృష్టం బావుండి ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు.. పైగా కారు నుజ్జునుజ్జు అయినా ఆమె కూడా సురక్షితంగా ఉంది.
విశాఖ నగరంలో మంగళవారం అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఆరా తీస్తే ఆ కారు డ్రైవ్ చేస్తుంది ఓ లేడీ డాక్టర్ అని, ఆమె మద్యం మత్తులో ఉన్నారని తెలిసింది. కారు విఐపి రోడ్డులో ప్యారడైజ్ హోటల్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న ఏడు మోటర్ బైక్ లను ఢీకొట్టి డివైడర్ ఫుట్ పాత్ ఎక్కి అక్కడున్న ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారుతో సహా ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన అనంతరం ఆమె మరో కారులో వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com