Chittoor: వరద బీభత్సం.. వాగులో కొట్టుకుపోయిన కారు.. ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

Chittoor: అన్నమయ్య జిల్లా విషాదం చోటుచేసుకుంది. పెద్దతిప్పసముద్రం మండలంలోని సంపతికోట వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం అర్థరాత్రి సంపతి కోట వద్ద వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో మౌనిక అనే యువతి చనిపోయింది. మరొకరు గల్లంతయ్యారు. బీ కొత్తపేటకు చెందిన రమణ, రమాదేవి దంపతులు తమ కూతురితో కలిసి బెంగళూరు ఆస్పత్రి నుంచి బి కొత్తపేటకు వస్తున్నారు. సంపతికోట వద్దకు రాగానే వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
డ్రైవర్ వాగులోంచి కారును పోనివ్వడంతో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. వెనుకాలే వస్తున్న మరో కారులో ఉన్నవారు కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రమణ రమాదేవి దంపతులను రక్షించగలిగారు. కానీ వారి కూతురు మౌనిక వరద ఉధృతికి చనిపోయింది. తెల్లవారుజామున మౌనిక మృతదేహం లభ్యమైంది. కారు డ్రైవర్ వాగులోనే కొట్టుకపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com