Home Minister Anitha : హోంమంత్రి అనితపై కేసు కొట్టివేత

హోంమంత్రి అనితకు చౌక్ బౌన్స్ కేసులో ఊరట దక్కింది. తన వద్ద తీసుకున్న రూ.70లక్షలకు గానూ అనిత ఇచ్చిన చెక్కు చెల్లలేదని 2019లో వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ కోర్టును ఆశ్రయించారు. కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయానికి రాగా, విశాఖ కోర్టులో ప్రొసీడింగ్స్ కొట్టేయాలని అనిత హైకోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం విచారణ జరగ్గా ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది. చెక్ బౌన్స్ కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారుడు వేగి శ్రీనివాసరావు, హోమంత్రి నిర్ణయించుకున్నారన్నారు. ఇరువురి మధ్య కుదిరిన రాజీలో భాగంగా ఇప్పటికే రూ.10లక్షలు వేగి శ్రీనివాసరావుకు అందజేశామని, మరో రూ.5లక్షలు చెక్ రూపంలో వేగి శ్రీనివాసరావు తరఫు న్యాయవాదికి అందజేస్తున్నామని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com