CASE:వైసీపీ కీలక నేతపై కేసు నమోదు

CASE:వైసీపీ కీలక నేతపై కేసు నమోదు
X
వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరీపై కేసు నమోదు... చింతమనేనిపై దాడి ఘటనపై కేసు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్‌తో పాటు పలు సెక్షన్ల కింద ఏలూరు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, అబ్బయ్యచౌదరి మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. చింతమనేని డ్రైవర్, గన్‌మ్యాన్‌‌లపై అబ్బయ్యచౌదరి దాడికి పాల్పడగా... పోలీసులు కేసు నమోదు చేశారు.

తిట్టానని ఒప్పుకుంటున్నా: ప్రభాకర్

ఓ గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై, వెనుతిరిగిన సమయంలో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, తన కారుకు అడ్డుగా పెట్టి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. కారును అడ్డు తీయాలని తాను వెళ్లి అభ్యర్థించినా.. దుర్భాషలాడుతూ అబ్బయ్యచౌదరి ఇనుప రాడ్డు తీసుకుని దాడి చేశారని చింతమనేని గన్‌మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ అల్లరి మూకలు ప్రభాకర్‌పై దాడికి ప్రయత్నించాయని డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. పెదవేగి మండలం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. అటు వైసీపీ వర్గీయులు పెదవేగి మండలం కొండలరావుపాలెంలోని కొఠారు ఇంటికి భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి, పర్యవేక్షించారు. ఈ సంఘటనపై చింతమనేని ప్రభాకర్‌ ఏలూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదానికి సంబంధించిన ఆధారాలను ఎస్పీకి అందించారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే దాడి

సాక్ష్యాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేపైనే హత్యాయత్నం జరిగిందన్న వార్తలు ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ నేతలు హత్యాయత్నం జరిపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పోలీసులు అధికారికంగా స్పందించలేదు. చింతమనేనిని హత్యాయత్నం వార్తలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags

Next Story