AP : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్‌లో రూ.కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ చేశారని ఆయనపై ఆరోపణలున్నాయి. లీజు ముగిసినా క్వార్ట్జ్ తరలించారని ఫిర్యాదు అందడంతో కాకాణి సహా ఏడుగురిపై FIR నమోదు చేశారు. గోవర్ధన్ రెడ్డిని ఏ4గా చేర్చారు. ఆయనపై 120బి, 447, 427, 379, 220, 506, 129తో పాటు ఎక్స్‌ప్లోజివ్ సబ్‌స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తొలుత ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరులైన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసులు రెడ్డిలపై కేసు నమోదు చేయగా, వీరు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. తాజాగా సోమవారం ఈ కేసులో కాకాణితో సహా మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏ6, ఏ8గా ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిని గూడూరు కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com