ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారులు, వైసీపీ నేతలపై కేసులు నమోదు

X
తాడిపత్రి ఘటనలో ఎట్టకేలకు MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపైన, ఆయన కుమారులు, YCP నేతలపై కేసులు నమోదు చేశారు. JC ప్రభాకర్‌రెడ్డి అనుచరులు సుబ్బారాయుడు, దాసరి కిరణ్ లాయర్ నోటీసుతో.. శనివారం అర్థరాత్రి కేసు నమోదు చేశారు. JC డ్రైవర్‌ను కులం పేరుతో దూషించినందుకు MLA పెద్దారెడ్డిపై ఎస్సీ-ఎస్టీ కేసు పెట్టారు. అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని కారుతో గుద్ది చంపాలని చూసినందుకు ఎమ్మెల్యే పెద్దారెడ్డి తనయులు హర్షవర్థన్‌రెడ్డి, సాయిప్రతాప్‌రెడ్డిపై సెక్షన్ 307 కింద కేసు నమోదైంది. మరికొందరు వైసీపీ నాయకులపైనా 307 సెక్షన్ పెట్టారు. JC అనుచరుడు దాసరి కిరణ్‌పై దాడి చేసినందుకు 324 సెక్షన్ కింద మరికొందరిపై కేసు బుక్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
