Nara lokesh : నారా లోకేష్‌పై కేసు నమోదు..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై కేసు నమోదు చేశారు విజయవాడ కృష్ణలంక పోలీసులు. సెక్షన్ 341, 186, 269 కింద కేసులు పెట్టారు. కోవిడ్ నిబంధనల ఉల్లంఘించారని, ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించారని, పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ లోకేష్‌పై కేసులు పెట్టారు. నిన్న గన్నవరం నుంచి నరసరావుపేట వెళ్లేందుకు లోకేష్ బయలుదేరడంతో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ కనకదుర్గ వారధి వరకూ వచ్చాక.. అక్కడి నుంచి ఉండవల్లి పంపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఐతే.. తనను ఎందుకు ఆపుతున్నారో చెప్పాలని, పరామర్శకు వెళ్లడానికి కూడా పర్మిషన్ కావాలా అని లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపైనే లోకేష్ కాన్వాయ్‌తోపాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. తానేమీ ఫ్యాక్షనిస్టును కాదని, కేవలం పరామర్శకు వెళ్లడానికి కూడా అనుమతి లేదని చెప్పడం ఏంటని లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చివరికి ఆయనకు 41(A) కింద నోటీసులు ఇచ్చి, తర్వాత ఉండవల్లి తీసుకువెళ్లి వదిలిపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కృష్ణలంక పోలీసులు కేసులు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com