YCP MLC: "కులాల మధ్య చిచ్చు రేపిన వైసీపీ ఎమ్మెల్సీ పదవి"

YCP MLC: కులాల మధ్య చిచ్చు రేపిన వైసీపీ ఎమ్మెల్సీ పదవి
YCP MLC: వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక కాక.. కులాల మధ్య చిచ్చు రేపిన పదవులు

YCP MLC: వైసీపీలో ఎమ్మెల్సీ ఎన్నిక కాక. కులాల మధ్య చిచ్చు రేపిన పదవులు.. అధిష్టానంపై అసంతృప్తుల నిరసన గళం.. కష్టపడ్డా గుర్తింపు లేదని గుస్సా.. టైం చూసి షాక్ ఇచ్చే ధోరణిలో భంగపాటు నేతలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైసీపీలో కాకరేపుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతుందంటూ పలు సామాజిక వర్గాలు బాహటంగానే అధిష్టానంపై నిరసనగళం విప్పుతున్నాయి. అనంతపురం జిల్లాలో కురుబ, బోయ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. పార్టీ గెలుపులో దాదాపు ఈ రెండు సామాజిక వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయి. జిల్లాలో కురుబ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉషాశ్రీచరణ్‌కు అవకాశం దక్కింది. హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్‌కు అవకాశం ఇచ్చారు. ఇక బోయ సామాజిక వర్గం నుంచి తలారి రంగయ్య అనంతపురం ఎంపీగా ఉన్నారు. అటు కర్నూలు జిల్లా నుంచి మంత్రిగా గుమ్మనూరు జయరాం కొనసాగుతున్నారు. అయితే జిల్లాలో క్రియాశీలకంగా ఉన్న తమకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత లేదని పలు సామాజికవర్గాల నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

మైనార్టీలకు ఎమ్మెల్సీతో పాటు మేయర్ పదవి కేటాయించారు. ఇక అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పదవి కూడా ఆ వర్గానికి చెందిన వారికే కేటాయించారు. అయితే క్రీయాశీలకంగా ఉన్నా తమ వర్గానికి పదవులను కేటాయించలేదని మైనార్టీలు ప్రభుత్వంపై గుస్సాగా ఉన్నారు. తాడిపత్రిలో వైసీపీ నుంచి బలమైన నేతగా ఉన్న ఫయాజ్ భాషకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై అనుచరులు భగ్గుమంటున్నారు. ఎమ్మెల్సీ సీటుపై గంపెడాశలు పెట్టుకుని భంగపడ్డ ఫయాజ్ బాష.. తనకు జరిగిన అన్యాయంపై అనుచరుల వద్ద వాపోయారట. మరోవైపు అనంతపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ నూర్ మహమ్మద్‌ కూడా అధిష్టానం తీరుపై మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది ఉన్న దూదేకుల సామాజిక వర్గాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బైట్: నూర్ మహమ్మద్ అనంతపురం మాజీ మున్సిపల్ చైర్మన్ సీనియర్ వైసీపీ నాయకులు

ఇక అనంతపురం మాజీ మేయర్ రాగే పరుశురాం కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ఆశపడి భంగపడ్డారు. పరుశురాంకు ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడంపై ఈయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన పరశురామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గెలుపుకోసం ఎంతో కృషి చేశారు. జిల్లాలో బోయ సామాజిక వర్గంతో సమానంగా ఉన్న తమ వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. బోయసాజికవర్గానికి ఎక్కువ మొత్తంలో కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీలో బోయ సామాజిక వర్గానికి ఉన్న ప్రాధాన్యత కురుబలకు లేదనే చర్చ జరుగుతోంది.

మరోవైపు బీసీలకు కూడా అంతంత మాత్రమే ప్రాధాన్యత అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీ వర్గానికి చెందిన పైలా నర్సింహయ్యకు కూడా నిరాశే ఎదురైంది. గత ఎన్నికలకు ముందు పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన పైలాకు ఈసారి కచ్చితంగా మంచి పదవి వస్తుందని భావించినా... అధిష్టానం నిర్ణయంతో భంగపాటు తప్పలేదు. జగన్ నిర్ణయంతో యాదవ సామాజికవర్గం కూడా భగ్గుమంటోంది.

మొత్తానికి జగన్ చర్యలతో రాష్ట్రంలోని పలు సామాజికవర్గాలు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ తమ వర్గానికి దక్కాల్సిన ప్రధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు వ్యతిరేకంగా నిరసనగళం విప్పుతూ తమ నిర్ణయాన్ని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఇక ఈ పదవుల గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.

Tags

Read MoreRead Less
Next Story