నేడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ

X
By - Sambasiva Rao |14 July 2021 10:15 AM IST
YS Jagan Bail Petition: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది.
YS Jagan Bail Petition: సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే సీఎం జగన్, ఎంపీ రఘురామలు సీబీఐ ప్రత్యేక కోర్టుకు తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. దీనిపై నేడు సీబీఐ కోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌పై ఇవాళ వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఇటు సీబీఐ మాత్రం వాదించేది లేదని... పిటిషన్‌లోని అంశాలను చట్టపరిధిలోకి తీసుకుని విచక్షణ మేరకు నిర్ణయించాలని కోర్టును కోరింది. జగన్ వాదనలపై రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది సమాధానాలు ఇచ్చేందుకు సమయం కోరడంతో విచారణ నేటికి వాయిదా పడింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com