వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతం

X
CBI On YS Viveka Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రామ్‌కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం... పులివెందులలోని వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద దర్యాప్తు చేపట్టారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మతోపాటు వ్యక్తిగత సహాయకుడు ఇనాయతుల్లా నుంచి మరిన్ని వివరాలను సీబీఐ ఆరా తీసింది. గంటన్నరపాటు సాగిన విచారణ అనంతరం పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న సీబీఐ సభ్యులు.. కేసుపై చర్చించారు. వివేకా ఇంటివాచ్‌మెన్ రంగయ్య, వివేకా సన్నిహితుడు గంగిరెడ్డిల వ్యాఖ్యల నేపథ్యంలో...సీబీఐ అధికారుల విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
