CBN: పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్నా: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పావర్టీకి దిగువన ఉన్న కొన్ని కుటుంబాలను తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. జీరో పావర్టీ P4 పథకంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు పేద కుటుంబాలను దత్తత తీసుకుంటున్న నిర్ణయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా పేదరిక నిర్మూలనలో తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. తెలుగు వారు ఎక్కడున్నా ఈ కార్యక్రమంలో భాగం కావాలని సూచించారు.
ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా.. 57,503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని.. విశాఖపట్నం జిల్లా చివరలో ఉందన్నారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి సీఎంకు అధికారులు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com