CBN: క్వాంటం విప్లవానికి నాయకత్వం ఏపీదే

క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. క్వాంటం టెక్నాలజీ, భారత విజ్ఞాన చరిత్ర, దేశ-రాష్ట్ర భవిష్యత్ ఆర్థిక దిశపై సమగ్రంగా వివరిస్తూ, అమరావతిని భారత క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజెంటేషన్ ద్వారా క్వాంటం ప్రోగ్రామ్లోని కీలక అంశాలను వివరించిన సీఎం, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేలాది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో ‘క్వాంటమ్ టాక్’ నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
చర్చంతా క్వాంటమ్ గురించే...
ప్రస్తుతం అందరూ క్వాంటమ్ టెక్నాలజీ గురించే ఆలోచిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబుఅన్నారు. ఆధునిక పరిశోధల కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ( ఉంటుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేయబోతోందన్నారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ‘‘1970లో చైనా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. 1991లో భారత్లో ఆ సంస్కరణలు వచ్చాయి. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. వ్యవసాయ రంగంలో సంస్కరణలతో ఆర్థికాభివృద్ధికి ముందడుగు పడింది. హరిత విప్లవంతో దేశ స్థితిగతులు సమూలంగా మారాయి. ఆహార ధాన్యాల విషయంలో భారత్ స్వయం సమృద్ధి సాధించింది. సామాన్యుల సాధికారతే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొస్తోంది. విశాఖకు చాలా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి ఆ నగరం చిరునామాగా మారబోతోంది. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం’’ అని చంద్రబాబు వివరించారు. 25 ఏళ్ల క్రితమే ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేసిన చంద్రబాబు, అదే తరహాలో ఇప్పుడు క్వాంటం రంగంలోనూ ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉన్నట్లే, భారత్కు క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని, క్రీస్తుపూర్వం 2500 నాటికే అర్బన్ ప్లానింగ్, జీరో ఆవిష్కరణ, అడ్వాన్స్డ్ అస్ట్రానమీ వంటి రంగాల్లో భారత్ ప్రపంచానికి దారి చూపిందని వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

