CBN: రాష్ట్రపతికి అవమానంపై చంద్రబాబు ఆవేదన

CBN: రాష్ట్రపతికి అవమానంపై చంద్రబాబు ఆవేదన
X
దేశానికే అగౌరవమన్న చంద్రబాబు... వివరణ ఇవ్వాలని కేంద్రం ఆదేశం

భారత రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము­కి పశ్చిమ బెం­గా­ల్ పర్య­టన చేదు అను­భ­వా­లు ఎదు­ర­య్యా­యి. రా­ష్ట్ర ప్ర­భు­త్వ తీ­రు­తో ప్రో­టో­కా­ల్ ఉల్లం­ఘ­నల పట్ల దే­శ­వ్యా­ప్తం­గా వి­చా­రం వ్య­క్త­మ­వు­తోం­ది. ఈ క్ర­మం­లో­నే ఆం­ధ్ర­ప్ర­దే­శ్ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు ఎక్స్ వే­ది­క­గా స్పం­ది­స్తూ.. రా­ష్ట్ర­ప­తి పట్ల అగౌ­ర­వం దే­శా­ని­కే అవ­మా­నం అస­హ­నం వ్య­క్తం చే­శా­రు. ఆయన తన ట్వీ­ట్‌­లో "ఒక శక్తి­వం­త­మైన ప్ర­జా­స్వా­మ్యం­లో రా­జ్యాం­గ­బ­ద్ధ­మైన పద­వు­లు రా­జ­కీ­యా­ల­కు అతీ­త­మ­ని, రా­ష్ట్ర­ప­తి పదవి మన గణ­తం­త్ర వ్య­వ­స్థ యొ­క్క గౌ­ర­వా­ని­కి చి­హ్న­మ­ని ఈ సం­ద­ర్భం­గా సీఎం గు­ర్తు చే­శా­రు. రా­ష్ట్ర­ప­తి పట్ల ప్ర­ద­ర్శిం­చా­ల్సిన కనీస మర్యాద, గౌ­ర­వం­లో లో­పా­లు జర­గ­డం కే­వ­లం ఆ పద­వి­కే కా­కుం­డా, దేశ రా­జ్యాంగ స్ఫూ­ర్తి­కే వి­ఘా­త­మ­ని చం­ద్ర­బా­బు నా­యు­డు అభి­ప్రా­య­ప­డ్డా­రు. రా­జ్యాంగ సం­స్థల పవి­త్ర­త­ను కా­పా­డ­టం మన బా­ధ్య­త­న్నా­రు.

బెంగాల్‌ సీఎంపై రాష్ట్రపతి ముర్ము ఆగ్రహం

పశ్చిమ బెం­గా­ల్‌ రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి మమతా బె­న­ర్జీ­పై రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము ఆగ్ర­హg వ్య­క్తం చే­శా­రు. పశ్చిమ బెం­గా­ల్‌ రా­ష్ట్రం­లో­ని సి­లి­గు­రి­లో తన పర్య­ట­న­కు సం­బం­ధిం­చి సరైన ఏర్పా­ట్లు చే­య­క­పో­వ­డం­పై ము­ర్ము అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. అం­త­ర్జా­తీయ కా­ర్య­క్ర­మా­ని­కి వే­దిక ఎం­పిక అం­శా­ని­కి సం­బం­ధిం­చి ఏర్పా­ట్ల­ను సరి­గా చే­య­క­పో­వ­డా­న్ని ము­ర్ము ఆక్షే­పిం­చా­రు. 9వ అం­త­ర్జా­తీయ సం­త­ల్ సద­స్సు­లో పా­ల్గొ­న­డా­ని­కి సి­లి­గు­రి­కి వచ్చిన ము­ర్ము.. ము­ఖ్య­మం­త్రి నుం­చి, రా­ష్ట్ర మం­త్రుల నుం­చి కూడా తనకు ఆహ్వా­నం అం­ద­లే­ద­న్నా­రు. ‘మమత నా చె­ల్లె­లు లాం­టి­ది. బహు­శా ఆమె కో­పం­గా ఉం­డ­వ­చ్చు. నేను బెం­గా­ల్‌ పర్య­ట­న­కు వస్తే ఆమె నన్ను పట్టిం­చు­కో­లే­దు. సం­తా­ల్‌ ది­వ­స్‌­కు సరైన ఏర్పా­ట్లు చే­య­లే­దు. కా­ర్య­క్ర­మా­ని­కి మమత హా­జ­రు కా­క­పో­వ­డం బా­ధిం­చిం­ది. ఆమె అం­త­ర్జా­తీయ కా­ర్య­క్ర­మా­న్ని ఇంత ఇరు­కైన ప్ర­దే­శం­లో ని­ర్వ­హిం­చా­ల­ని ఎం­చు­కుం­దో నాకు తె­లి­య­దు. వే­దిక పె­ద్ద­ది­గా ఉంటే, సమా­వే­శా­ని­కి ఎక్కువ మంది హా­జ­ర­య్యే­వా­రు అని ఆమె బి­ధా­న్‌­న­గ­ర్‌­లో జరి­గిన మరో కా­ర్య­క్ర­మం­లో స్ప­ష్టం చే­శా­రు.. బి­ధా­న్‌­న­గ­ర్‌­లో సమా­వే­శం జరి­గి ఉంటే ఐదు లక్షల మంది సు­ల­భం­గా హా­జ­ర­య్యే­వా­ర­ని కూడా రాష్ట్రపతి ద్రౌపది ము­ర్ము ప్ర­ధా­నం­గా ప్ర­స్తా­విం­చా­రు.

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్‌

రా­ష్ట్ర­ప­తి ద్రౌ­ప­ది ము­ర్ము పర్య­ట­న­లో ప్రొ­టో­కా­ల్‌ పా­టిం­చ­క­పో­వ­డం­పై కేం­ద్ర ప్ర­భు­త్వం, పశ్చిమ బెం­గా­ల్‌ ప్ర­భు­త్వం మధ్య వి­వా­దం కొ­న­సా­గు­తోం­ది. ప్రొ­టో­కా­ల్‌ ఉల్లం­ఘ­న­కు సం­బం­ధిం­చి పూ­ర్తి వి­వ­రణ ఇవ్వా­ల­ని రా­ష్ట్ర ప్ర­భు­త్వా­న్ని కేం­ద్రం ఆదే­శిం­చిం­ది. ఈ మే­ర­కు రా­ష్ట్ర ప్ర­ధాన కా­ర్య­ద­ర్శి నం­ది­ని చక్ర­వ­ర్తి­కి కేం­ద్ర హోం కా­ర్య­ద­ర్శి గో­విం­ద్‌ మో­హ­న్‌ లేఖ రా­శా­రు. అం­దు­లో కేం­ద్రం కొ­న్ని అం­శా­ల­ను ప్ర­స్తా­విం­చిం­ది.

* రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్ ఎందుకు హాజరు కాలేదు?

* రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌ రూమ్‌లో నీళ్లు లేవు.

* రాష్ట్రపతి కాన్వాయ్‌ వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది.

* డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్‌, సిలిగుడి పోలీస్‌ కమిషనర్‌, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయండి.

దీ­ని­కి సం­బం­ధిం­చి ఆది­వా­రం సా­యం­త్రం 5 గంటల వరకు పశ్చిమ బెం­గా­ల్‌­కు కేం­ద్ర ప్ర­భు­త్వం సమయం ఇచ్చిం­ది. అం­త­ర్జా­తీయ సం­తా­ల్ సద­స్సు­లో పా­ల్గొ­నేం­దు­కు రా­ష్ట్ర­ప­తి ము­ర్ము శని­వా­రం పశ్చిమ బెం­గా­ల్‌ వె­ళ్లా­రు.

Tags

Next Story