CBN: ఉపాధ్యాయుడిగా మారిన చంద్రబాబు

సత్యసాయి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పర్యటించారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు జెడ్పీ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ 2.0 కార్యక్రమంలో చంద్రబాబు, లోకేశ్ భాగస్వామ్యం అయ్యారు. సీఎం విద్యార్థులతో మమేకమయ్యి పాఠశాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబు విద్యార్థులకు పాఠాలు బోధించి ఉపాధ్యాయుడిగా మారారు. విద్యార్థులతో కలిసి మంత్రి లోకేశ్ పాఠాలు విన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 2 కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డ్ దిశగా అడుగులు వేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 74 లక్షల మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
పేరెంట్స్ టీచర్ మీట్‌లో విద్యార్థుల ప్రొగ్రెస్ రికార్డ్‌ను సీఎం పరిశీలించి మార్కులపై ఆరా తీశారు. పాఠశాలల పనితీరు, ప్రగతి గురించి విద్యార్థులను, తల్లిదండ్రులను అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఇప్పటి వరకూ కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమవ్వగా.. ఈ ప్రక్రియను గవర్నమెంట్ స్కూళ్లలో కూడా తీసుకువచ్చారు. గతేడాది మెగా పీటీఎమ్ తొలి ప్రయత్నం ప్రారంభించగా... ఇది రెండోసారి.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో కార్యక్రమం నిర్వహించి.. పాఠశాల విద్యలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల సహకారంపై సీఎం చర్చించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్, పాజిటివ్ పేరెంటింగ్, డ్రగ్ ఎడిక్షన్ అంశాలపై నిపుణులతో అవగాహన కార్యక్రమాన్నిచేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com