CBN: నేడే సింగపూర్‌కు చంద్రబాబు

CBN: నేడే సింగపూర్‌కు చంద్రబాబు
X
నేటి నుంచి చంద్రబాబు సింగపూర్ పర్యటన... చంద్రబాబుతోపాటు లోకేశ్, నారాయణ... ఆరు రోజుల పాటు కీలక చర్చలు

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­ట­మే లక్ష్యం­గా ము­ఖ్య­మం­త్రి నారా చం­ద్ర­బా­బు నా­యు­డు నేడు సిం­గ­పూ­ర్ లో పర్య­ట­న­‌­కు బ‌­య­‌­లు­దే­ర­‌­ను­న్నా­రు.. సీఎం చం­ద్ర­బా­బు­తో పాటు మం­త్రు­లు నారా లో­కే­ష్, నా­రా­య­‌­ణ‌, టీజీ భ‌­ర­‌­త్ ల‌తో కూ­డిన 8 మంది బృం­దం సిం­గ­‌­పూ­ర్ లో ప‌­ర్య­టిం­చిం­చ­‌­ను­న్నా­రు.. నేటి నుం­చి 31 తేదీ వరకు 6 రో­జుల పాటు ఆ దే­శం­లో పర్య­టిం­చి.. ది­గ్గజ సం­స్థల ప్ర­తి­ని­ధు­లు, యా­జ­మా­న్యా­లు, ప్ర­ము­ఖు­లు, పా­రి­శ్రా­మిక వే­త్త­ల­తో భేటీ కా­ను­న్నా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వం ఏర్ప­డిన తరు­వాత దా­వో­స్ పర్య­ట­న­కు వె­ళ్లిన సీఎం.. రెం­డో వి­దే­శీ పర్య­ట­న­గా సిం­గ­పూ­ర్ కు వె­ళ్తు­న్నా­రు.

బ్రాండ్ ఏపీ ప్రమోషన్..

బ్రాం­డ్ ఏపీ ప్ర­మో­ష­న్‌­తో రా­ష్ట్రా­ని­కి పె­ట్టు­బ­డు­ల­ను సా­ధిం­చేం­దు­కు సీఎం చం­ద్ర­బా­బుఈ పర్య­ట­న­ను వే­దిక చే­సు­కో­ను­న్నా­రు. ప్ర­భు­త్వం తీ­సు­కు వచ్చిన నూతన పా­రి­శ్రా­మిక పా­ల­సీ­లు, స్పీ­డ్ ఆఫ్ డూ­యిం­గ్ బి­జె­నె­స్ వి­ధా­నా­ల­ను వి­వ­రిం­చి పె­ట్టు­బ­డు­దా­రు­ల­ను సీఎం ఆహ్వా­నిం­చ­ను­న్నా­రు. పో­ర్టు­లు, ఎయి­ర్ పో­ర్టు­లు, హై­వే­లు, హా­ర్బ­ర్లు, భూ­ముల లభ్యత, కనె­క్టి­వి­టీ, 1053 కి.మీ తీర ప్రాం­తం, ని­పు­ణు­లైన మానవ వన­రు­లు గు­రిం­చి వి­వ­రిం­చ­ను­న్నా­రు. పె­ట్టు­బ­డు­లు పె­ట్టా­ల్సిం­ది­గా కో­ర­ను­న్నా­రు.

ప్రవాసాంధ్రులతో భేటీ

సిం­గ­పూ­ర్‌­లో 6 రో­జుల పర్య­ట­న­లో భా­గం­గా సీ­ఈ­ఓ­లు, కం­పె­నీల ప్ర­తి­ని­ధు­ల­తో భేటీ కా­ను­న్నా­రు. మొ­ద­టి రోజు సిం­గ­పూ­ర్ సహా సమీప దే­శా­ల్లో ని­వ­సి­స్తు­న్న ప్ర­వా­సాం­ధ్రుల సంఘం ని­ర్వ­హిం­చే ‘తె­లు­గు డయా­స్పో­రా’ సమా­వే­శం­లో చం­ద్ర­బా­బు పా­ల్గొ­న­ను­న్నా­రు. ఏపీ­లో పె­ట్ట­బ­డు­ల­పై ఆయా దే­శాల వా­రి­ని ఆహ్వా­నిం­చ­ను­న్నా­రు. పే­ద­రిక ని­ర్మూ­ల­న­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­ప­ట్టిన పీ4 కా­ర్య­క్ర­మం­లో భా­గ­స్వా­ము­లు కా­వా­ల­ని సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు పా­రి­శ్రా­మిక వే­త్త­ల­ను కో­ర­ను­న్నా­రు. ఆది­వా­రం జూలై 27న 'వన్ వర­ల్డ్ ఇం­ట­ర్నే­ష­న­ల్ స్కూ­ల్' డి­జి­ట­ల్ క్యాం­ప­స్ వద్ద ప్ర­వా­సాం­ధ్రు­ల­తో సమా­వే­శం కా­ను­న్నా­రు. ఉదయం 10 గంటల నుం­చి సా­యం­త్రం 5 వరకు కొ­న­సా­గే ఈ సభలో వి­దే­శీ పె­ట్టు­బ­డు­లు, అమ­రా­వ­తి ని­ర్మా­ణం గు­రిం­చి ప్ర­వా­సీ­యు­ల­కు సీఎం చం­ద్ర­బా­బు వి­వ­రిం­చ­ను­న్నా­రు. వి­శా­ఖ­ప­ట్నం­లో ఈ నవం­బ­రు­లో ని­ర్వ­హిం­చ­ను­న్న పె­ట్టు­బ­డుల సద­స్సు­కు వి­దే­శీ పా­రి­శ్రా­మి­క­వే­త్త­ల్ని చం­ద్ర­బా­బు ఆహ్వా­నిం­చ­ను­న్నా­రు. ఈ మే­ర­కు వి­విధ దే­శాల ప్ర­ము­ఖు­ల­తో ఆయన భేటీ అవు­తా­రు. సిం­గ­పూ­ర్‌­లో ని­ర్వ­హిం­చే బి­జి­నె­స్‌ రో­డ్‌­షో­కు హా­జ­ర­వు­తా­రు. సిం­గ­పూ­ర్‌­లో­ని వి­విధ మౌ­లిక సదు­పా­యా­లు, లా­జి­స్టి­క్‌ కేం­ద్రా­ల్ని సం­ద­ర్శి­స్తా­రు.

Tags

Next Story