cbn: టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రొగ్రెస్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాసంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై వారికి వ్యక్తిగతంగా ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్నారు. వివిధ సర్వేల్లో నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తలు వెల్లడించిన అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ నివేదికలు రూపొందించారు. సీఎం చంద్రబాబు కార్యక్రమాల షెడ్యూల్ను బట్టి రోజుకు ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఒక్కో ఎమ్మెల్యేతో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమవుతున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం వల్ల తమ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని.. అమలు చేసిన హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు వాటి పరిష్కారాలు, పార్టీ పదవులు వంటి ప్రధాన అంశాలు అజెండాగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు భేటీ అవుతున్నారు. పరిపాలనతో పాటు ఎమ్మెల్యేలతో సమావేశాలు.. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com