CBN: మూడు దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటిస్తున్నారు. నవంబర్ లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలకనున్నారు. రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. వివిధ దేశాల నుండి పెట్టుబడిదారులను ఆకర్షించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బాటలు వేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు సీఎం వెంట వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరిస్తారు.విశాఖపట్నంలో నవంబర్‌లో రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు వివిధ దేశాల పారిశ్రామికవేత్తలను, ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు వెళ్తున్నారు.
అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమవుతారు. ఆయన నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బ్రిటన్ రాజధాని లండన్‌లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా లండన్ పర్యటన కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, దావోస్‌లోనూ ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే, మంత్రి లోకేష్ కూడా ఏపీలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అనుభవం కలిగిన సమర్థ నాయకత్వం ఉందని తెలిపారు. విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు అందరూ రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆయన వెల్లడించారు. మొత్తం మీద అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనలతో ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చే పనిలో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com