CBN: ఒక్కో పారిశ్రామిక వేత్త..ఒక్క పరిశ్రమ అయినా పెట్టండి

CBN: ఒక్కో పారిశ్రామిక వేత్త..ఒక్క పరిశ్రమ అయినా పెట్టండి
X
సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి... ఇప్పటికే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం... పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రెండో స్థానంలో ఉంది

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను దే­శం­లో­నే అగ్ర­గా­మి పె­ట్టు­బ­డి గమ్య­స్థా­నం­గా మా­ర్చ­డ­మే తమ ప్ర­భు­త్వ లక్ష్య­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నా­యు­డు స్ప­ష్టం చే­శా­రు. రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­కి పరి­శ్ర­మ­లే ప్ర­ధాన శక్తి­గా మా­రా­ల­ని పే­ర్కొం­టూ… దే­శం­లో­ని ప్ర­ముఖ పా­రి­శ్రా­మి­క­వే­త్త­లు ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో కనీ­సం ఒక్క పరి­శ్ర­మై­నా స్థా­పిం­చా­ల­ని ఆయన పి­లు­పు­ని­చ్చా­రు. సీఐఐ వా­ర్షిక సద­స్సు­లో ము­ఖ్య అతి­థి­గా పా­ల్గొ­న్న చం­ద్ర­బా­బు… రా­ష్ట్ర ఆర్థిక భవి­ష్య­త్తు, పె­ట్టు­బ­డుల అవ­కా­శా­లు, సాం­కే­తిక రంగ అభి­వృ­ద్ధి­పై తన వి­జ­న్‌­ను వి­వ­రిం­చా­రు. గత 23 నె­ల­ల్లో ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు రూ.23 లక్షల కో­ట్ల పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­గ­లి­గా­మ­ని, వాటి ద్వా­రా సు­మా­రు 23 లక్షల ఉద్యోగ అవ­కా­శా­లు కల్పిం­చే అవ­కా­శం ఉం­ద­ని సీఎం వె­ల్ల­డిం­చా­రు. ప్ర­స్తు­తం పె­ట్టు­బ­డుల ఆక­ర్ష­ణ­లో రా­ష్ట్రం దే­శం­లో రెం­డో స్థా­నం­లో ఉం­ద­ని… త్వ­ర­లో­నే తొలి స్థా­నా­ని­కి తీ­సు­కె­ళ్ల­డ­మే తమ లక్ష్య­మ­ని చె­ప్పా­రు. పరి­శ్ర­మ­లు పె­ట్టు­బ­డు­లు పె­ట్ట­డా­ని­కి అను­కూ­ల­మైన వా­తా­వ­ర­ణం కల్పిం­చ­డం­లో ప్ర­భు­త్వం పూ­ర్తి­గా కట్టు­బ­డి ఉం­ద­ని స్ప­ష్టం చే­శా­రు.

“రా­జ­కీయ నా­య­కు­లు అనేక హా­మీ­లు ఇస్తా­రు. కానీ ప్ర­భు­త్వ పని­తీ­రు­కు ని­జ­మైన న్యా­య­ని­ర్ణే­త­లు పా­రి­శ్రా­మి­క­వే­త్త­లే” అని చం­ద్ర­బా­బు వ్యా­ఖ్యా­నిం­చా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు వచ్చి ప్ర­భు­త్వ సా­మ­ర్థ్యా­న్ని స్వ­యం­గా పరి­శీ­లిం­చా­ల­ని కో­రు­తూ… ఒక­సా­రి ఎం­ఓ­యూ కు­ది­రి­తే దా­ని­ని ప్ర­భు­త్వ ప్రా­జె­క్టు­గా భా­విం­చి వి­జ­య­వం­తం చేసే బా­ధ్యత తమ­దే­న­ని భరో­సా ఇచ్చా­రు. ‘వి­జ­న్ ఫర్ ఇం­డి­యా @100 – ది ఫ్యూ­చ­ర్’ అం­శం­పై మా­ట్లా­డిన సీఎం… భా­ర­త్ ప్ర­స్తు­తం కొ­త్త సాం­కే­తిక యు­గం­లో­కి అడు­గు­పె­డు­తోం­ద­న్నా­రు. ఆర్టి­ఫి­షి­య­ల్ ఇం­టె­లి­జె­న్స్, క్వాం­ట­మ్ కం­ప్యూ­టిం­గ్, సె­మీ­కం­డ­క్ట­ర్లు, క్లీ­న్ ఎన­ర్జీ, అడ్వా­న్స్‌­డ్ మా­న్యు­ఫా­క్చ­రిం­గ్, ఇం­టె­లి­జెం­ట్ లా­జి­స్టి­క్స్ వంటి రం­గా­లు రా­బో­యే కా­లం­లో దేశ భవి­ష్య­త్తు­ను ని­ర్ధే­శి­స్తా­య­ని తె­లి­పా­రు. ఇలాం­టి కీలక సమ­యం­లో నరేం­ద్ర మోదీ దేశ ప్ర­ధా­ని­గా ఉం­డ­టం అదృ­ష్ట­మ­ని వ్యా­ఖ్యా­నిం­చిన చం­ద్ర­బా­బు… 2047 నా­టి­కి భా­ర­త్ ప్ర­పం­చం­లో అతి­పె­ద్ద ఆర్థిక వ్య­వ­స్థ­గా అవ­త­రి­స్తుం­ద­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­ను “స్వ­ర్ణాం­ధ్ర”గా తీ­ర్చి­ది­ద్ద­డ­మే తమ సం­క­ల్ప­మ­ని పే­ర్కొ­న్న సీఎం… 2047 నా­టి­కి రా­ష్ట్ర ఆర్థిక వ్య­వ­స్థ­ను 2.4 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల స్థా­యి­కి తీ­సు­కె­ళ్లా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్న­ట్లు చె­ప్పా­రు. దేశం 500 గి­గా­వా­ట్ల పు­న­రు­త్పా­దక ఇంధన ఉత్ప­త్తి లక్ష్యా­న్ని ని­ర్దే­శిం­చు­కో­గా… అం­దు­లో 160 గి­గా­వా­ట్ల వా­టా­ను ఆం­ధ్ర­ప్ర­దే­శ్ నుం­చే అం­దిం­చా­ల­ని ప్ర­ణా­ళిక రూ­పొం­దిం­చా­మ­ని తె­లి­పా­రు. ఇప్ప­టి­కే 90 గి­గా­వా­ట్ల ప్రా­జె­క్టుల పను­లు ప్రా­రం­భ­మై­న­ట్లు వె­ల్ల­డిం­చా­రు. ఈ పు­న­రు­త్పా­దక ఇంధన సా­మ­ర్థ్య­మే వి­శా­ఖ­ప­ట్నా­ని­కి గూ­గు­ల్ డేటా సెం­ట­ర్‌­ను తీ­సు­కు­వ­చ్చిం­ద­ని సీఎం చె­ప్పా­రు. ప్ర­స్తు­తం రా­ష్ట్రం­లో డేటా సెం­ట­ర్ల ఏర్పా­టు­కు భా­రీ­గా డి­మాం­డ్ పె­రు­గు­తోం­ద­ని… ప్ర­పం­చ­స్థా­యి సం­స్థ­లు పె­ట్టు­బ­డు­ల­కు ఆస­క్తి చూ­పు­తు­న్నా­య­ని తె­లి­పా­రు. ఆర్సె­లా­ర్ మి­త్త­ల్, రె­న్యూ, కా­గ్ని­జెం­ట్ వంటి ది­గ్గజ కం­పె­నీ­లు ఇప్ప­టి­కే రా­ష్ట్ర ప్ర­భు­త్వం­తో కలి­సి పని­చే­స్తు­న్నా­య­ని పే­ర్కొ­న్నా­రు.

అమ­రా­వ­తి­ని అత్యా­ధు­నిక సౌ­క­ర్యా­ల­తో కూ­డిన భవి­ష్య­త్ నగ­రం­గా అభి­వృ­ద్ధి చే­స్తు­న్నా­మ­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. కా­లు­ష్య­ర­హిత నగ­రం­గా రూ­పొం­ది­స్తు­న్న అమ­రా­వ­తి­లో డి­సెం­బ­ర్ నా­టి­కి దే­శం­లో­ని తొలి క్వాం­ట­మ్ కం­ప్యూ­ట­ర్ పని ప్రా­రం­భి­స్తుం­ద­ని వె­ల్ల­డిం­చా­రు. “ఆయు­ష్షు పెం­చు­కో­వా­ల­ను­కు­నే­వా­రు ఇప్పు­డే అమ­రా­వ­తి­లో స్థ­లం కొ­నా­లి” అంటూ ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు సభలో ఆస­క్తి­ని రే­కె­త్తిం­చా­యి. వి­శా­ఖ­ప­ట్నా­న్ని మరో ప్ర­ధాన ఆర్థిక కేం­ద్రం­గా తీ­ర్చి­ది­ద్దు­తు­న్నా­మ­ని… అక్కడ డేటా సెం­ట­ర్లు, ఫా­ర్మా పరి­శ్ర­మ­లు, రేర్ ఎర్త్ మి­న­ర­ల్స్, స్టీ­ల్ ఇం­డ­స్ట్రీ­లు పె­ద్ద ఎత్తున ఏర్పా­ట­వు­తా­య­ని చె­ప్పా­రు.

Tags

Next Story