CBN: నదులు అనుసంధానిస్తాం..కరువును తరిమేస్తాం

CBN: నదులు అనుసంధానిస్తాం..కరువును తరిమేస్తాం
X
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన.. నీటి నిర్వహణతో కరువును పారదోలుతాం... డిసెంబర్ 25 నాటికి డయాఫ్రం వాల్ పూర్తి

నీ­టి­ని సమ­ర్థం­గా ని­ర్వ­హి­స్తే కరవు అనే మాట రా­ద­ని ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు. ఎక్క­డి­క­క్కడ భూ­గ­ర్భ జలా­ల­ను పెం­చు­కో­వా­ల్సిన అవ­స­రం ఉం­ద­ని, ఈ మే­ర­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సూ­చిం­చా­రు. ఏపీ అసెం­బ్లీ సమా­వే­శా­ల్లో భా­గం­గా శు­క్ర­వా­రం నాడు నీ­టి­పా­రు­దల, ప్రా­జె­క్టు­ల­పై ఆయన మా­ట్లా­డా­రు. ఈ సం­ద­ర్భం­గా చం­ద్ర­బా­బు కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఏపీ, తె­లం­గా­ణ­లో మె­జా­రి­టీ ప్రా­జె­క్టు­లు తాను ప్రా­రం­భిం­చి­న­వే అని వె­ల్ల­డిం­చా­రు. తొ­లి­సా­రి­గా అనం­త­పు­రం­లో రై­తు­ల­కు పె­ట్టు­బ­డి రా­యి­తీ ఇవ్వ­డం ప్రా­రం­భిం­చా­న­ని తె­లి­పా­రు. ఫ్లో­రై­డ్‌ బా­ధిత నల్గొండ జి­ల్లా­కు లి­ఫ్ట్‌ ద్వా­రా శ్రీ­శై­లం ఎడమ కా­ల్వ ద్వా­రా నీ­ళ్లి­చ్చా­మ­ని తె­లి­పా­రు. సరైన వి­ని­యో­గం­తో రా­ష్ట్రం­లో 700 టీ­ఎం­సీల మేర భూ­గ­ర్భ జలా­లు పె­రు­గు­తా­య­ని చె­ప్పా­రు. పదే­ళ్ల­లో 439 టీ­ఎం­సీ­లు కృ­ష్ణా డె­ల్టా­కు తీ­సు­కొ­చ్చి­న­ట్లు తె­లి­పా­రు. డి­సెం­బ­రు 25 నా­టి­కి పో­ల­వ­లం డయా­ఫ్ర­మ్‌ వా­ల్‌ పూ­ర్తి చే­స్తా­మ­ని వె­ల్ల­డిం­చా­రు. కు­ప్పం ప్రాం­తా­ని­కి నీ­ళ్లు తర­లిం­చి జల­హా­ర­తి ఇవ్వ­డం­తో తన జన్మ సా­ర్థ­క­మైం­ద­న్నా­రు. నదుల అను­సం­ధా­నం­తో సా­గు­కు ఊత­మ­ని గతం­లో అప్ప­టి ప్ర­ధా­ని వా­జ్‌­పే­యీ­కి సూ­చిం­చా­న­ని చం­ద్ర­బా­బు తె­లి­పా­రు. అప్పు­డు టా­స్క్‌­ఫో­ర్స్‌ వే­సి­నా అనం­తర పరి­ణా­మా­ల­తో అది ముం­దు­కు సా­గ­లే­ద­ని పే­ర్కొ­న్నా­రు. సరైన వి­ని­యో­గం­తో రా­ష్ట్రం­లో 700 టీ­ఎం­సీల మేర భూ­గ­ర్భ జలా­లు పె­రు­గు­తా­య­ని చె­ప్పా­రు.

పోలవరం సమస్యలను అధిగమిస్తున్నాం

పో­ల­వ­రం ని­ర్మా­ణం­లో సమ­స్య­లు అధి­గ­మి­స్తూ వచ్చా­మ­ని ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. గత పా­ల­న­లో ప్రా­జె­క్టు డయా­ఫ్ర­మ్‌ వా­ల్‌ కొ­ట్టు­కు­పో­యిం­ద­ని... దీ­ని­కి మళ్లీ రూ.వె­య్యి కో­ట్లు ఖర్చు చేసే పరి­స్థి­తి ఏర్ప­డిం­ద­న్నా­రు. డి­సెం­బ­రు 25 నా­టి­కి పో­ల­వ­లం డయా­ఫ్ర­మ్‌ వా­ల్‌ పూ­ర్తి చే­స్తా­మ­ని... ఉత్త­రాం­ధ్ర సుజల స్ర­వం­తి ద్వా­రా వం­శ­ధార వరకు నీ­ళ్లు తర­లిం­చ­వ­చ్చ­న్నా­రు. "రూ.960 కో­ట్ల­తో చే­ప­ట్టిన ఈ ప్రా­జె­క్టు పను­లు 75 శాతం పూ­ర్త­య్యా­యి. అక్టో­బ­రు­లో­నే అన­కా­ప­ల్లి వరకు ఈ జలా­లు తీ­సు­కొ­స్తాం. రూ.1425 కో­ట్ల­తో ఈ ప్రా­జె­క్టు­ను పో­ల­వ­రం కుడి కా­లు­వ­తో అను­సం­ధా­నిం­చాం.” అని చం­ద్ర­బా­బు వె­ల్ల­డిం­చా­రు. గత పా­ల­న­లో చి­త్తూ­రు జి­ల్లా­లో ప్రీ బ్యా­లె­న్సిం­గ్‌ రి­జ­ర్వా­య­ర్లు చే­ప­ట్టా­రు. వై­కా­పా వర్గీ­యుల కోసం రూ.2,144 కో­ట్ల­తో ప్రా­జె­క్టు చే­ప­ట్టా­రు. ని­బం­ధ­న­లు ఉల్లం­ఘిం­చ­డం­తో ఎన్‌­జీ­టీ సు­ప్రీం కో­ర్టు­కు వె­ళ్లిం­ది. పను­లు ని­లి­పి­వే­యిం­చిన కో­ర్టు.. రూ.100 కో­ట్లు ఫై­న్‌ వేసి, రూ.25 కో­ట్లు కట్టా­ల­ని చె­ప్పిం­ది. వై­కా­పా నే­త­లు చే­సిన తప్పు­ల­కు ప్ర­భు­త్వం రూ.25 కో­ట్లు జరి­మా­నా కట్టిం­ది’’ అని సీఎం చం­ద్ర­బా­బు పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story