CBN: "మద్యం కేసులో వైసీపీ నేతలు అడ్డంగా దొరికారు"

వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్ విచారణ తుది దశకు చేరిందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘అన్ని ఆధారాలతో గత పాలకులు అడ్డంగా దొరికారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకున్నారు. దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలనే ఇప్పటివరకు మాట్లాడలేదు. జగన్.. తాను చేసిన తప్పుల్ని కూడా మనమీదకు నెట్టేసే రకం. కేంద్రంలో తెదేపా కీలకపాత్ర పోషిస్తున్నందున ఎంపీల తీరు ఇంకా మెరుగుపడాలి. రాష్ట్ర అంశాలే ప్రధాన అజెండాగా ఎంపీలు ఇంకా బాగా మాట్లాడాలి. రాష్ట్ర ప్రగతిని దేశస్థాయిలో వివరించాల్సిన బాధ్యత ఎంపీలదే’’ అని చంద్రబాబు అన్నారు.
మామిడి రైతులకు చంద్రబాబు శుభవార్త
సీఎం చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని కుప్పం పర్యటనలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అడుగులు వేశారు. మామిడి రైతుల పరిష్కారానికి రూ.260 కోట్ల నిధులను విడుదల చేశారు. రూ.4 సబ్సిడీతో 6.5 లక్షల టన్నుల తోతాపురి మామిడి కాయలు కొనుగోలు చేసేందుకు కేటాయించాలని ఆదేశించారు. దీంతో మార్కెట్ సమస్యలతో బాధపడుతున్న చిత్తూరు జిల్లా మామిడి రైతులకు లబ్ధిచేకూరనుంది. సబ్సిడీ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ అకౌంట్లను పరిశీలించుకోవాలని చెప్పారు. అయితే రూ. 260 కోట్లు MIS విధానంపై సహాయం అందించాలని కేంద్ర సహకారాన్ని ప్రభుత్వం కోరిందని వ్యవశాయ శాఖ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com