విజయనగరంలో కరోనా బారిన పడి సీసీఎస్‌ డీఎస్పీ మృతి..!

విజయనగరంలో కరోనా బారిన పడి సీసీఎస్‌ డీఎస్పీ మృతి..!
కరోనా బారిన పడి మరో పోలీసు ఉన్నతాధికారి కన్నమూశారు. ఈ విషాద ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. CCS డీఎస్పీ పాపారావు గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు.

కరోనా బారిన పడి మరో పోలీసు ఉన్నతాధికారి కన్నమూశారు. ఈ విషాద ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. CCS డీఎస్పీ పాపారావు గత కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అటు.. పాపారావు భార్య, ఇద్దరు కుమారులు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. కడసారి భర్తను చూసుకోలేని దయనీయ స్థితిలో ఉండిపోయారు భార్య సుమతి. దీంతో పాపారావు స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం శివరామపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story