విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన..!
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్‌లో 100శాతం పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయించింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్‌లో 100శాతం పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయించింది. ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. జనవరి 27నే స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణకు ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపామని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ లేదని.. అయినప్పటికీ నిర్దేశిత అంశాల్లో అవసరమైన మేరకు వారితో..సంప్రదింపులు జరిపి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోరామని వెల్లడించింది.
Next Story