AP High Court: ఏపీ హైకోర్టును కర్నూలుకు మార్చే ప్రతిపాదన లేదు: కేంద్రం

AP High Court: ఏపీ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు మార్చే ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని.. మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖతపూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టు ప్రధాన బెంచ్‌ని రాష్ట్ర విభజన చట్టానికి అనుగుణంగా.. 2019 జనవరిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2020 ఫిబ్రవరిలో హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు.. మార్చాలని రాష్ట్ర సీఎం ప్రతిపాదించారని తెలిపారు. హైకోర్టు ఫ్రిన్సిపల్ బెంచ్ బదిలీని సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో.. సంప్రదించిన తర్వాత ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు.
రాష్ట్ర హైకోర్టు నిర్వహణకు అయ్యే ఖర్చు.. భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని తెలిపారు. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. కోర్టు రోజువారి పరిపాలనను నిర్వహించే బాధ్యత కలిగి ఉంటారని వెల్లడించారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై.. ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు రెండూ తమ అభిప్రాయాన్ని.. రూపొందించి పూర్తి ప్రతిపాదననను కేంద్రానికి సమర్పించాలని కానీ.. కేంద్రం వద్ద ప్రస్తుతం అలాంటి పూర్తి ప్రతిపాదన ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com